![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -236 లో..... అందరు హాల్లో ఉండగా చాలా హ్యాపీగా రాఘవ, సూర్య ఇంటికి వస్తారు. పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసాను పెద్దనాన్న అని గుడ్ న్యూస్ అందరికి చెప్తాడు సూర్య. దాంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూర్య ఈరోజు ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఒక తండ్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని రాఘవ చెప్తాడు. థాంక్స్ రుద్ర.. నీ వల్లే ఇదంతా అసలు ఆ ప్రాజెక్ట్ రావడానికి కారణం నువ్వే.. దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ చేసావో నాకు తెలుసు.. వాడు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా నువ్వు ప్రిపేర్ చేసిందేనని రాఘవ అనగానే అందరూ షాక్ అవుతారు.
అవునా అని పెద్దసారు అంటాడు. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు కానీ ప్రతీ దాంట్లో సాయంగా ఉంటున్నాడని రుద్ర గురించి రాఘవ పొగుడుతాడు. నాకు తెలుసు రుద్ర ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తాడని పెద్దసారు అంటాడు. నాకు ఈ కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి దానికోసం ఏదైనా చేస్తానని రుద్ర అంటాడు. ఇషిక ఇప్పటికైనా అర్థం అయిందా సూర్య స్టామినా.. హాఫ్ నాలెడ్జ్ అన్నావ్ కదా.. ఎప్పుడు కూడా భర్తని తక్కువ చేసి మాట్లాడకూడదు. తనకి సపోర్ట్ గా ఉండాలని రుద్ర అనగానే తప్పకుండా బావగారు అని ఇషిక అంటుంది. మరి సూర్యకి కంగ్రాట్స్ చెప్పమని గంగ అనగానే కంగ్రాట్స్ సూర్య అని ఇషిక చెప్తుంది.
ఆ తర్వాత ఇంత గుడ్ న్యూస్ చెప్పావ్ కదా.. ఈ రోజు పాయసం చేస్తానని గంగ అంటుంది. ఆ తర్వాత వీరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే ఇషిక వెళ్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా అని ఇషిక అంటుంది. అవసరం ఉన్నప్పుడు చెప్తాను..... కంగ్రాట్స్ ఫర్ యువర్ హస్బెండ్ సక్సెస్ అని వీరు అంటాడు. తన సక్సెస్ తనది.. నాది కాదు.. బిజినెస్ మొత్తం నా గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటే ఇలా జరిగింది ఏంటని ఇషిక డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |